ఇప్పటివరకు డేట్ కి వెళ్లలేదు!

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది పునర్నవి భూపాళం. ఆ తరువాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’ వంటి చిత్రాల్లో నటించింది. ‘బిగ్ బాస్ సీజన్ 3’లో కంటెస్టెంట్ గా పాల్గొని తన గ్లామర్ తో మెప్పించింది. రీసెంట్ గా ‘ఆహా’లో ‘కమిట్మెంటల్’ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ‘కమిట్మెంటల్’ హీరో ఉధ్బవ్ తో ప్రేమలో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించింది.

అందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసిన కొన్ని పనుల వలన అలాంటి రూమర్లు వస్తున్నాయని తేల్చి చెప్పింది. రియల్ లైఫ్ లో ఎవరితోనైనా డేటింగ్ కి వెళ్లారా..? అని పునర్నవిని ప్రశ్నించగా.. లేదని చెప్పింది పునర్నవి. ఇక డేటింగ్ యాప్ గురించి మాట్లాడుతూ.. అలాంటి యాప్స్ వాడేంత టైమ్, ఇంట్రెస్ట్ రెండూ తనకు లేవని.. అయితే తన ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డేటింగ్ యాప్ లో ఎవరో మైంటైన్ చేస్తున్నారని.. హాసిని, తార అనే పేర్లతో తన ఫోటో ప్రొఫైల్స్ పెట్టిన విషయాన్ని వెల్లడించింది.

అది కూడా తన స్నేహితులు చూసి చెప్పే వరకు తనకు తెలియలేదని స్పష్టం చేసింది. ఈ కాలంలో నటీమణుల పేర్లు వాడుకుంటూ ఇలాంటి యాప్స్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. పునర్నవి కూడా ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘సైకిల్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus