Punarnavi Bhupalam: పుట్టిన రోజున ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన పునర్నవి!

ఉయ్యాలా జంపాల చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా పునర్నవి భూపాళం, ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రం లో సపోర్టింగ్ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ మరియు హీరోయిన్ గా చేసిన ఈమెకి 2019 వ సంవత్సరం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది.

ఈ రియాలిటీ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రజలకు అత్యంత చేరువు అయ్యింది.సినిమాల్లో నటించినదానికంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది, ఇక నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు తీసి బయటపెట్టిన తర్వాత ఈమెకి అడపాదడపా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అది కూడా పెద్ద సినిమాల్లో కాదు, చిన్న సినిమాల్లో. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘సైకిల్’.

2020 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె అదృశ్యం అయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కాగా, అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె మాట్లాడుతూ ‘ఇనాళ్ళు నేను జీవించినందుకు, జీవితం లో నాకు గొప్ప కోరికలు ఏమి అవసరం లేదు అనిపించింది.

కేవలం నన్ను (Punarnavi Bhupalam) ప్రేమించే కొంతమంది శ్రేయోభిలాషులు, తినడానికి ఎంతో రుచికరమైన ఆహరం ఉంటే చాలు.ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చాయి. ఒక మూడేళ్లు వెనక్కి వెళ్లి మిడ్ 20 ఏళ్ళ వయస్సు ని మరొకసారి ఎంజాయ్ చెయ్యాలని ఉంది’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పునర్నవి భూపాళం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus