Puneeth Rajkumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రేమ, పెళ్లి కహాని..!

కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తని ఇప్పటికీ శాండల్ వుడ్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించి 9 నెలలు పూర్తికావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి. కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా పునీత్ ని తలుచుకుని అప్పుడప్పుడు బాధపడుతున్న సందర్భాలను మనం సోషల్ మీడియాలో చూసాం. 46 ఏళ్ల వయసుకే ఆయన మరణించాడు అనే వార్త అందరినీ మరింత బాధపెడుతోంది.

ఇదిలా ఉండగా..పునీత్ రాజ్ కుమార్ జీవితంలో ఎన్నో అందమైన విశేషాలు ఉన్నాయి అని చాలా తక్కువ మందికే తెలుసు. ఎటువంటి వివాదాల్లో తల దూర్చకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు పునీత్. ఈయన పర్సనల్ లైఫ్ ని కూడా మీడియాకి చాలా దూరంగా ఉంచేవారు.అందుకే అతను ప్రేమ, పెళ్లి విషయాల గురించి కూడా జనాలకు పెద్దగా తెలీదు. బాగా డబ్బు, పేరు సంపాదించుకున్న పునీత్ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.

పునీత్ ది లవ్ మ్యారేజే. చిక్ మగళూరుకు చెందిన అశ్వినిని… ఓ పార్టీలో కలుసుకున్నాడు పునీత్.పునీత్ స్నేహితుల ఆహ్వానం మేరకు ఆమె ఆ పెళ్లి వేడుకకు హాజరైంది. ఆ టైంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా.. అటు తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు తమ పెద్దలను ఒప్పించి 1999 డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ ఫ్యామిలీలో అశ్విని చిన్న కోడలుగా అడుగుపెట్టింది. ముందుగా వచ్చిన కోడళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు.

కాబట్టి మొదట ఈమె రాజ్ కుమార్ ఫ్యామిలీతో కలవడానికి ఇబ్బంది పడేదట. కానీ పునీత్ ఆమెకు తన ఇంట్లో వాళ్ళ గురించి చెప్పి నార్మల్ అయ్యేలా చేసాడట. దీంతో రాజ్ కుమార్ కూతుర్లలానే ఈమె కూడా కలిసిపోయింది. పునీత్ మరణించిన తర్వాత కూడా ఈమెను రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు ఆమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి పేర్లు ధృతి,వందిత.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus