Puneeth Rajkumar Wife: భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఫస్ట్ పోస్ట్ ఇదే!

పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం అభిమానులకు షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసిన పునీత్ రాజ్ కుమార్ ఆ సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడలేదు. వివిధ రాష్ట్రాల నుంచి పునీత్ అభిమానులు పునీత్ సమాధి దగ్గర నివాళి అర్పించడానికి వస్తుండటం గమనార్హం.

పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఇన్ స్టాగ్రామ్ వేదికగా భర్త మరణం తర్వాత తొలి భావోద్వేగ లేఖను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని అశ్విని ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి తొలి పోస్ట్ ను పునీత్ కు అంకితమిచ్చారు. అశ్విని ఆ పోస్ట్ లో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం తమతో పాటు కర్ణాటక ప్రజలను కూడా షాక్ కు గురి చేసిందని చెప్పుకొచ్చారు. ఆయనను పవర్ స్టార్ అని పిలిచే ఫ్యాన్స్ కు పునీత్ లేని లోటును ఊహించడం కష్టమేనని అశ్విని పేర్కొన్నారు.

అభిమానులు మనో నిబ్బరం కోల్పోకుండా గౌరవంగా పునీత్ కు అంతిమ వీడ్కోలు పలికారని అశ్విని తెలిపారు. విదేశాల నుంచి కూడా పునీత్ కు నివాళులు అర్పించడానికి అభిమానులు వస్తున్నారని పునీత్ ను వేలాదిమంది ఫాలో అవుతూ నేత్రదానానికి ముందుకు రావడం.. అభిమానుల హృదయంలో పునీత్ కు ఉన్న స్థానం చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని అశ్విని అన్నారు. అభిమానులు చేసే మంచి పనులలో పునీత్ జీవించే ఉంటారని ఫ్యామిలీకి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్జతలు అంటూ అశ్విని చెప్పుకొచ్చారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus