మెదుడులో పురుగు కదిలిననట్లుంది అని ఓ డైలాగ్ సినిమాల్లో వినే ఉంటారు. మీరు కూడా ఎవరినో అనే ఉంటాడు. అలాగే ఎంప్టీ మైండ్ డెవిల్స్ డెన్ అనే మాట కూడా ఇంగ్లిష్ పెద్దలు చెబుతుంటారు. అంతలా మెదడు గురించి, అది మనిషిని మార్చేసే విధానం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా మెదడు గురించి చెప్పారు. మెదడు ఓ పెద్ద దెయ్యం అని.. దానిని భయపెట్టడం నేర్చుకోండి అని సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పూరి.. తాజాగా ‘ది డెవిల్’ పేరుతో మెదడు, దాని ఆలోచన తీరు గురించి మాట్లాడారు. ఎవడో మనకు వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో అవే ఆలోచనలు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మనల్ని ఎలా చంపుతాడోనని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని రోజులకు నిజంగా నన్ను చంపేస్తాడా? ఒకవేళ చంపితే నా వాళ్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచన వస్తుంది.
దాంతో వాడు చంపేవరకు ఎందుకు? నేనే వాణ్ని చంపేస్తా అని తీర్మానానికి వచ్చేస్తారు. వాడిని గొడ్డలితో నరికేస్తారు. ఇక జీవితాంతం జైల్లో గడుపుతారు. వీటన్నింటికీ కారణం మన ఆలోచనలు అంటూ మెదడు పరిస్థితిని వివరించారు. మన బ్రెయిన్ పెద్ద దెయ్యం. దాని పెద్ద క్వాలిటీ ఓవర్ థింకింగ్. ఒకరోజులో దాదాపు 60వేల ఆలోచనలు వస్తాయట. అందులో 95శాతం నెగెటివ్ థాట్స్ ఉంటాయి. అందుకే మన మైండ్ పెద్ద ఫియర్ ఫ్యాక్టరీ అని చెప్పారు పూరి.
మన మైండ్ భయాలను పుట్టిస్తూనే ఉంటుంది. అందుకే మైండ్ చెప్పేవి వినొద్దు. సీరియస్‌గా తీసుకోవద్దు. లేదంటే పిరికివాళ్లు అయిపోతాం. అందుకే ధ్యానం చేయాలి. లోపల ఉన్న దెయ్యాన్ని భయపెట్టాలి. ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. మనశ్శాంతిగా ఉండాలి అని పూరి జగన్నాథ్ సూచించారు. విన్నారుగా మరి మీకు కూడా మెదడును భయపెట్టండి.