‘బాహుబలి'(సిరీస్) మరియు ‘కె.జి.ఎఫ్'(సిరీస్) లతో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే ‘సాహో’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అంతేకాదు పూరి జగన్నాథ్- విజయ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందుతోంది. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు రూ.150కోట్ల నుండీ రూ.200కోట్ల వరకూ బడ్జెట్ పెడుతుంటారు.
కానీ విజయ్- పూరి ల సినిమా రూ.50కోట్ల నుండీ రూ.70కోట్ల లోపే పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారట. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ అగ్ర నిర్మాత సపోర్ట్ ఉన్నప్పటికీ.. అంత తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు ఫినిష్ అవుతుండడం విశేషం.హిందీ డిజిటల్ మరియు డబ్బింగ్ రైట్స్ రూపంలోనే ఈ చిత్రానికి రూ.20కోట్ల వరకూ నాన్ – థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందట.మరి ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి..
అక్కడ బయ్యర్స్.. ఈ చిత్రాన్ని ఎంతెంత పెట్టి కొంటారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సినిమా కనుక హిట్ అయితే.. పూరి స్టార్ డం ఇప్పుడున్న దానికంటే డబుల్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు అప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం పూరితో ఎగబడి సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతారు.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!