Balayya Babu: అన్‌స్టాపబుల్‌ మరో పాన్ ఇండియా స్టార్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా అన్‌స్టాపబుల్‌ టాక్ షో పేరుకు తగ్గట్లుగానే ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా చాలా ఓపెన్ గా బాలకృష్ణ తో మాట్లాడుతూ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేశారు. వారి అనుభవాలను కూడా ఓపెన్ గా బయట పెడుతూ చాలా ఆప్యాయంగా గడిపారు. అయితే నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోను చాలా త్వరగా ముగిస్తారు అని మొన్నటి వరకు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

కానీ బాలయ్య బాబు ఇంకా ముందుకు కొనసాగించే విధంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దర్శకులు హీరోలు అని తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా బాలయ్య బాబు తో సందడి చేయబోతున్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక వారితో పాటు మరొక పాన్ ఇండియా స్టార్ హీరో అలాగే స్టార్ దర్శకుడు కూడా బాలయ్య షోలో కి ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం.

ఇక ఆ దర్శకుడు హీరో మరెవరో కాదు లైగర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేయడానికి చాలా పవర్ ఫుల్ గా సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్. ఈ రౌడీ స్టార్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు అయితే మాములుగా లేవు. ఇక నందమూరి బాలకృష్ణ గతంలోనే వీరిని అన్‌స్టాపబుల్‌ షోలోకి ఆహ్వానించాలని అనుకున్నారు. కానీ బిజీగా ఉండటం వలన ఇద్దరికి కుదరలేదు.

ఇక ఇటీవల వారి షూటింగ్ కు కొంత గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ.. బాలయ్య టాక్ షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక లైగర్ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియన్ మార్కెట్ కు తగ్గట్టుగా రూపొందుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు ధర్మ ప్రొడక్షన్స్ లో వారు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus