డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన పూరి జగన్నాథ్

  • July 20, 2017 / 06:25 AM IST

డ్రగ్స్‌ కేసు విచారణ నేడు (బుధవారం) మొదలైంది. తొలిరోజు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ని ఎక్సైజ్‌ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారించింది. పూరి తన కొడుకు ఆకాష్, తమ్ముడు సాయి రామ్ శంకర్, న్యాయవాదులతో కలిసి ఎక్సైజ్‌ కార్యాలయంకి వచ్చారు. విచారణ గదిలోకి పూరీ జగన్నాథ్‌ మాత్రమే వెళ్లారు. ఆయన్ను మానసిక వైద్యుడు సమక్షంలో ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ విచారిస్తున్నట్లు తెలిసింది. కెల్విన్‌ ఎలా పరిచయం అయ్యారు?, ఎంతకాలంగా రోజులుగా డ్రగ్స్‌ వాడుతున్నారు?, కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు?, ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవి తేజ, సుబ్బరాజులకు.. డ్రగ్స్‌, కొకైన్‌ మీ నుంచే వెళ్లిన మాట నిజమా, కాదా?, బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా, మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి?.. ఇలాంటి ప్రశ్నలను ముందుగానే సిద్ధం చేసుకున్న పోలీసులు వాటికీ సమాధాలను పూరి నుంచి రాబట్టినట్లు సమాచారం. ఆ సమాధానాలను గోప్యంగా ఉంచారు.

సిట్ ముందుకు రోజుకొకరు.. పూరి జగన్నాథ్ తో పాటు డ్రగ్స్‌ కేసులో రోజుకొకరి చొప్పున 12 మంది సినిమా ప్రముఖులను సిట్‌ అధికారులు విచారించనున్నారు. 20న ఛార్మి, 21న ముమైత్‌ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందు సిట్‌ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఆగస్టు 2 వరకు విచారణ కొనసాగనుంది. ముమైత్‌ ఖాన్ బిగ్ బాస్ రియాల్టీ షో లో ఉంది.. కావున ఆమె షో నుంచి బయటకు రాగానే విచారిస్తారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus