Puri Jagannadh: అలా ఫీలైతే సింగిల్ గా ఉండిపోండి.. పూరీ కామెంట్స్ వైరల్!

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకునిగా పూరీ జగన్నాథ్ కు పేరుంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న పూరీ జగన్నాథ్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మీకు మీరుగా స్ట్రాంగ్ ఉమెన్ అని ఫీలైతే లైఫ్ లో సింగిల్ గా ఉండిపోవాలని ఆయన అన్నారు. స్టాంగ్ ఉమెన్ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ విధంగా చేస్తే జనాభా తగ్గుతుందని సమస్యలు తగ్గుతాయని అదే సమయంలో ఉత్పాదకత పెరుగుతుందని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. ఈ విధంగా చేయడం ద్వారా మనశ్శాంతి కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా ఉమెన్ కు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన వాళ్లు అవుతారని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం విడాకులు తీసుకున్న, విడిపోయిన, సింగిల్ గా ఉన్న మహిళల సంఖ్య 7 కోట్లు అని పూరీ చెప్పుకొచ్చారు.

నేను కోరుకునేది వాళ్లు కాదని సింగిల్ బై ఛాయిస్ అనేవాళ్లు నాకు ముఖ్యమని పూరీ అభిప్రాయపడ్డారు. నాకు మగాడి అవసరం లేదు అని భావించే వాళ్లు కావాలని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్లంతా దేవతలలా మారాలని పూరీ తెలిపారు. ఇలాంటి మహిళలు మన దేశంలో 3 కోట్ల మంది ఉంటే ఈ దేశం ఎలా ఉంటుందో ఊహించాలని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేయడం గమనార్హం.

అలాంటి ముక్కోటి దేవతలతో, వాళ్ల దీవెనలతో ఈ దేశం స్ట్రాంగ్ గా ఉండాలని నేను భావిస్తానని (Puri Jagannadh) పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తో పూరీ జగన్నాథ్ బిజీగా ఉండగా ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus