రవితేజతో పూరి సడెన్ మీటింగ్.. రూమర్స్ షురూ..!

Advertisement

ఇప్పుడు మాస్ మహారాజ్ గా మన రవితేజ దూసుకుపోతున్నప్పటికీ.. ఇతనికి లైఫ్ ఇచ్చిన దర్శకుడు మాత్రం పూరి జగన్నాథే అని చెప్పాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో రవితేజను స్టార్ ను చేసింది పూరినే.! అటు తరువాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనింతే’ ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలు ప్లాపులుగా మిగిలినప్పటికీ.. వీరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

వీటిలో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని పక్కన పెట్టేసినా.. ‘నేనింతే’ చిత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ నటనకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. రవితేజ ను సడెన్ గా మీట్ అయ్యాడట పూరి. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.’ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. మరో వైపు తన డ్రీం ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ కు హీరోని వెతికే పనిలో కూడా బిజీగా గడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో రవితేజను కలిసాడు కాబట్టి.. అతనితో ‘జన గణ మన’ సినిమాని తెరకెక్కించాలని పూరి డిసైడ్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ సంగతి గమనించాలి. ‘జన గణ మన’ ప్రాజెక్టుని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని పూరి భావిస్తున్నాడు. అలాంటప్పుడు టాలీవుడ్లో మాత్రమే క్రేజ్ ఉన్న రవితేజతో ఎందుకు చేస్తాడు. బహుశా మరో స్క్రిప్ట్ ఏదో వినిపించడానికి వెళ్ళుంటాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus