యువ హీరోలతో పూరీ మూవీ..!!

Advertisement

ప్రేమకథలను వెండి తెరపై చూపించడంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఉత్సాహవంతమైన అబ్బాయి, చురుకైన అమ్మాయి మధ్య ప్రేమ కథతో “ఇడియట్” తీసి హిట్ కొట్టారు. ఇద్దరు అందమైన భామలు ఒక యువకుడి ప్రేమిస్తే ఎలా ఉంటుందో బద్రిలో చూపించి బ్లాక్ బ్లస్టర్ అందుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో పూర్తి స్థాయి లవ్ స్టోరీతో సందడి చేసేందుకు పూరి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఒక బ్యూటీ కోసం ఇద్దరు
హ్యాండ్ సమ్ అబ్బాయిలు పోటీ పడే కథను తన మార్కుతో మలిచారు.

ప్రస్తుతము నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా “ఇజం” సినిమాను తెరకెక్కిస్తున్న ఈ స్టార్ డైరక్టర్, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు
తో “జన గణ మన” సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. మహేష్ డేట్స్ అడ్జెస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నారు.

ఇందుకోసం ఒక హీరోగా నేటి టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్యను ఎంచుకున్నారు. రెండవ హీరోగా పెళ్లిచూపులు సినిమా తో యువతను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండను తీసుకున్నట్టు సమాచారం. వీరిద్దరి మనసు దోచుకునే చిన్నదాని కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. ప్రతి సినిమాలో నూతన తారను పరిచయం చేసే అలవాటున్న పూరి ఇందులోనూ కొత్త నటిని ఎంపిక చేయనున్నారు. ఇజం వచ్చే నెల విడుదల కానుంది. అక్టోబర్ నుంచి కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news