Puri Jagannadh, Naga Chaitanya: పూరి పంచ్‌లు చైతు నోట… ఆ ఊహే అదిరిపోతోంది కదా!

పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కొత్త సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అని ఠక్కున చెప్పేస్తారు. ఆ సినిమా రీస్టార్ట్‌ ఎప్పుడు, రిలీజ్‌ ఇప్పుడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అనుకోండి. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు అయితే ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ ఏం సినిమా చేస్తారు, ఎవరితో ప్రాజెక్ట్‌ ఓకే చేస్తారు అనే చర్చలు మెల్లగా మొదలయ్యాయి. కారణం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆఖరికి వచ్చేసింది కాబట్టి.

మామూలుగా ముందుగా అనుకున్న లెక్క ప్రకారం అయితే పూరి జగన్నాథ్‌ తన తర్వాతి సినిమాను అయితే చిరంజీవితో (Chiranjeevi) లేదేంటే బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ఉండాలి. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ స్టార్ట్‌ కాకముందు ‘మంచి కథ సిద్ధం చేయ్‌.. సినిమా చేద్దాం’ అని చిరంజీవే అడిగారు. ఇక బాలయ్య అయితే ఎప్పుడంటే అప్పుడే రెడీ అనేలా పూరి జగన్నాథ్‌కు ఇప్పటికే ఆఫర్‌ ఇచ్చేశారట. అయితే ఇప్పుడు వినిపిస్తున్న హీరో పేరు ఈ రెండింటిలో లేదు.

అవును, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) పేరు తాజాగా పూరి జగన్నాథ్‌ హీరోల లిస్ట్‌లో చేరుతుంది అని అంటున్నారు. అదేంటి పూరి జగన్నాథ్‌ హీరోల లిస్ట్‌ అనుకుంటున్నారా? ఎలాంటి ఇమేజ్‌ ఉన్న హీరో అయినా ఆయనతో సినిమా చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడు. సినిమా ఫలితం తేడా కొట్టి ఉండొచ్చు కానీ.. ఆయన హీరో క్యారెక్టరైజేషన్‌ ఎప్పుడూ బ్లాక్‌బస్టరే. ఇప్పుడు అలాంటి హీరోగా నాగచైతన్య కనిపిస్తాడు అని చెబుతున్నారు.

పూరి క్యారెక్టరైజేషన్‌, వన్‌ లైనర్‌ పంచ్‌లు ఇప్పుడు నాగచైతన్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహించేసుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్‌. ప్రస్తుతం నాగచైతన్య.. చందు మొండేటి (Chandoo Mondeti) ‘తండేల్’ (Thandel) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన గంగపుత్రుడిగా కనిపిస్తాడు. దీంతో ఈ సినిమా తర్వాత పక్కా కమర్షియల్‌ సినిమా చేయాలని పూరికి ఓకే చెప్పారు అని టాక్‌. ఇక ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సంగతి చూస్తే.. ఇటీవల వివిధ కారణాల వల్ల ఆగిన ఈ సినిమా త్వరలో పునర్‌ ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. ఈ మేరకు స్పెషల్ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus