పూరి జగన్నాథ్ గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్!

  • September 26, 2016 / 08:43 AM IST

క్విక్ అన్నమాటకు మరో పేరు పూరి జగన్నాథ్. ఐడియా వచ్చిందే తడువుగా స్క్రిప్ట్ రెడీ కావడం, సెట్స్ మీదకు వెళ్లిపోవడం, ఫస్ట్ కాపీ సిద్ధం కావడం… చాలా వేగంగా జరిగిపోతాయి. హీరో ఎవరైనా అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేయడం జగన్ స్పెషల్. అందుకే పరిశ్రమలోకి వచ్చిన 16 ఏళ్లలో కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ భాషల్లో ఇప్పటి వారికి 37 సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా “ఇజం” మూవీని డైరక్ట్ చేస్తున్నారు. ఈ స్పీడ్ డైరక్టర్ నేడు (సెప్టెంబర్ 28) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పూరి కి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతూ… ఆయన రీల్ అండ్ రియల్ లైఫ్ సీక్రెట్స్ గురించి కథనం.

1. జన్మస్థలం కొత్తపల్లివిశాఖ పట్నం జిల్లాలోని బాపిరాజు కొత్తపల్లిలో 1966 సెప్టెంబర్ 28 న పూరి జగన్నాథ్ జన్మించారు. తల్లి దండ్రులు సత్యవతి, సింహాచలం. జగన్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉమా శంకర్, సాయి రామ్ శంకర్.

2. పుస్తకాల పురుగుమహాకవి శ్రీ శ్రీ, చలం, గోపి చంద్, శరత్, ముళ్లపూడి వెంకట రమణ, భానుమతి, విశ్వనాథ సత్యనారాయణ రచనలే కాకుండా రామాయణం, భారతం, భాగవతాలను జగన్నాథ్ చిన్నప్పుడే చదివేసారు. ఇప్పుడు ఇతర భాషల్లో ప్రాచుర్యం పొందిన పుస్తకాలను చదువుతుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా రీడింగ్ ని ఆపలేదు.

3. సినిమా టు టీవీ టు సినిమాపూరి మనీ మనీ, గులాబీ, నిన్నే పెళ్లాడుతా సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన తర్వాత డైరక్టర్ గా దూరదర్శన్ లో వంద ఎపిసోడ్లకు పైగా తీశారు. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలెట్టారు.

4. తప్పని సినీ కష్టాలుపోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి దర్శకుడిగా బ్రేక్ కోసం చాలా రోజులు ఎదురు చూసారు. మొదట్లో
సుమన్ హీరో గా “పాండు” సినిమా అవకాశం వచ్చింది కానీ అది ఆగిపోయింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా “థిల్లానా” చిత్రం డైరక్ట్ చేసే ఛాన్స్ అవచ్చింది. ఒక పాట కూడా రికార్డింగ్ జరిగింది అయినా సెట్స్ మీదకు వెళ్లలేదు. తొలి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసి సూపర్ సక్సస్ అయ్యారు.

5. ప్రేమ కథల స్పెషలిస్ట్సినిమాల్లో ప్రేమకథలను అందంగా చూపించే పూరి.. కాలేజీ రోజుల్లో ప్రేమ కథలు ఎక్కువగా రాసేవారు. అయన రాసిన మొదటి లవ్ స్టోరీ పేరు “తొలి చినుకు”. అలాంటివి అప్పుడే 25 ప్రేమ కథలు రాశారు.

6. ఇడియట్ పూరిఇడియట్ లోని లవ్ స్టోరీ పూరి సొంత లైఫ్ లోంచి పుట్టుకొచ్చింది. లావణ్య(భార్య)ను జగన్ చూసిన వెంటనే ప్రేమించారు. ఆ విషయాన్నీ వెంటనే ఆమెకు చెప్పడమే కాదు.. అంతే స్పీడ్ గా తన మాటలతో లావణ్య హృదయాన్ని గెలుచుకున్నారు. సనత్ నగర్ లోని వెంకటేశ్వర గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. వారికి ఆకాష్, పవిత్ర అని ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరూ బుజ్జిగాడు చిత్రంలో నటించారు.

7. గొప్ప పెయింటర్మెగా ఫోన్ తో హిట్లు ఇచ్చే జగన్ కుంచె పట్టుకుని ఎన్నో అపురూప చిత్రాలు గీశారు. స్కూల్ డేస్ లో డ్రాయింగ్ కాంపిటేషన్ లో పూరి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.

8. హిట్ యాడ్ మేకర్పూరి వాణిజ్య ప్రకటనలు చేశారంటే ఆ కంపెనీ బిజినెస్ పెరగాల్సిందే. అతని దర్శకత్వంలో వచ్చిన గోదావరి డీఏపీ యాడ్ రైతులందరికీ బాగా గుర్తిండి పోయింది. అలాగే ఎల్ ఎం ఎల్ వెస్పా స్కూటర్ యాడ్ కూడా పూరి తీసిన ప్రకటనల్లో మంచి పేరు తెచ్చి పెట్టింది.

9. బిగ్ బి తో సినిమాబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీయడం అందరి కల. ఆ కలని నిజం చేసుకున్నారు జగన్. ఆయనతో “బుడ్డా హోగా తేరా బాప్” అనే సినిమా తీసి హిట్ అందుకున్నారు. లాభాల్లో షేర్ ని కూడా సొంతం చేసుకున్నారు.

10. తెరపైన జగన్తెర వెనుక నుండి నడిపించడమే కాదు.. జగన్ అప్పుడప్పుడు తెర పైన కూడా కనిపించారు. శివ (హిందీ), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఏ మాయ చేసావే, టెంపర్ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus