యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది అతను కీలక పాత్ర పోషించిన ‘నా సామి రంగ’ రిలీజ్ అయ్యింది. అలాగే అతను హీరోగా చేస్తున్న ‘తిరగబడరసామీ’ ‘భలే ఉన్నాడే’ టీజర్లు కూడా రిలీజ్ అయ్యి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతలోనే అతను హీరోగా రూపొందిన మరో సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘పురుషోత్తముడు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ భీమన డైరెక్ట్ చేస్తుండగా ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ..లు నిర్మిస్తున్నారు. హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇక ‘పురుషోత్తముడు’ టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. 75 సెకన్ల నిడివి కలిగిన ఈ టీజర్.. ‘ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే.. మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడు అయ్యాడు.
ఇక్కడ మాట కాదు నాన్న ధర్మం ముఖ్యం’ అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్లో మొదలైంది. ‘హీరో ఓ పల్లెటూరికి రావడం అక్కడ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిస్తూనే, మరోపక్క అక్కడ కష్టాలు ఎదురుకొంటున్న జనాలకి సాయం చేసి అండగా నిలబడటం’ అనేది ఈ సినిమా స్టోరీ లైన్ గా తెలుస్తుంది. ఈ లైన్ తో ఇప్పటికే ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘మహర్షి’ (Maharshi) సినిమాలు వచ్చాయి.
‘ఇప్పుడు రాజ్ తరుణ్..కు ఉన్న ఇమేజ్ కి ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్..లు సెట్ అవుతాయా?’ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.? పైగా చివర్లో రిచ్ కిడ్ గా రాజ్ తరుణ్ ఫ్లైట్ లో నుండి దిగి వస్తున్నట్టు ఓ షాట్ ఉంది. ఇది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు (Mahesh Babu)..లకి వాడిన షాటే. గతేడాది ‘రామబాణం’ (Ramabanam) లో గోపీచంద్ (Gopichand) కూడా వాడటం జరిగింది. అయితే ‘పురుషోత్తముడు’ లో రమ్యకృష్ణ (Ramya Krishna) , ప్రకాష్ రాజ్(Prakash Raj), మురళీ శర్మ (Murali Sharma) వంటి పెద్ద క్యాస్టింగ్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.