‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) విడుదల సమయం దగ్గర పడుతుండటంతో, సుకుమార్ (Sukumar) టీమ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. సినిమా గ్రాండ్ విజువల్స్, కథనం, పాటలతో ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రికార్డ్ స్థాయిలో జరిగింది. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పాటలతోపాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అనుకుంటున్నారు.
విడుదలైన రెండు పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్ చేయగా, ఐటెం సాంగ్ మరింత ఆకట్టుకుంటుందని మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఈసారి దేవిశ్రీ ప్రసాద్ తోపాటు మరికొంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పని చేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో థమన్ (S.S.Thaman) కూడా భాగం కావడం పెద్ద చర్చనీయాంశమైంది. థమన్ తనతో పాటు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ, సినిమాకి బెస్ట్ అవుట్‌పుట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అంతేకాక, అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath), సామ్ సిఎస్ (Sam C. S.)కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పని చేయడం అనేది కొత్త ప్రయోగమే. ఫైనల్‌గా థియేటర్‌లో ప్రేక్షకులకీ మ్యూజిక్ కనెక్ట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం. మంచి ఎలివేషన్ మ్యూజిక్ ద్వారా కథకి ఉత్సాహం రాబట్టేందుకు ఈ మ్యూజిక్ టీమ్ చేసిన కృషి ఎంతవరకు వర్క్ అవుతుందో వేచి చూడాలి.
మూవీ టైటిల్ కార్డ్స్‌లో వీరు అందరికి క్రెడిట్ ఇవ్వనున్నారా లేదా అన్నది సినిమా విడుదల సమయంలో తెలుస్తుంది. ఇప్పటివరకు ‘పుష్ప 2’ ప్రమోషన్స్, హైప్ చూసినప్పటి కి, మ్యూజిక్ కూడా సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారెంటీ అనిపిస్తోంది.