Pushpa 2 The Rule: బుక్ మై షో టాప్ రికార్డులు.. పుష్ప రాజ్ స్థానం ఎంత?

ఇండియన్ సినిమా పరిశ్రమలో టాలీవుడ్ చిత్రాలు టికెట్ అమ్మకాల పరంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. అందుకు పుష్ప 2  (Pushpa 2 The Rule) ఉదాహరణగా నిలిచింది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో, అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ అమ్మకాల విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది. ‘బుక్ మై షో’ ప్లాట్‌ఫామ్‌లో కేవలం 14 రోజుల్లోనే 16.19 మిలియన్ టికెట్లు అమ్ముడై టాప్ ర్యాంకుల్లో నిలవడం విశేషం. గతంలో కేజీఎఫ్ 2 (KGF 2), బాహుబలి 2 (Baahubali 2), ఆర్ఆర్ఆర్ (RRR) వంటి చిత్రాలు బుక్ మై షోలో అత్యధిక టికెట్ అమ్మకాల రికార్డులను సొంతం చేసుకున్నాయి.

Pushpa 2 The Rule

కానీ “పుష్ప 2” అదే స్థాయిలో రానిస్తూ, రెండు వారాల్లోనే రెండవ స్థానాన్ని అందుకోవడం గొప్ప విషయం. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో చూపించిన హై వోల్టేజ్ వైబ్, సుకుమార్ నెరేషన్ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా మార్కెట్‌లో ఈ సినిమాకి వచ్చిన ఆదరణ, గ్లోబల్ లెవల్లో టికెట్ అమ్మకాల పరంగా విశేషంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం కేజీఎఫ్ 2 మొత్తం 17.1 మిలియన్ టికెట్ అమ్మకాలతో మొదటి స్థానంలో ఉండగా, పుష్ప 2 మరింత వేగంగా ఈ రికార్డును దాటే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఇప్పటికీ టాప్ 5లో ఉండడం గమనార్హం. అయితే “పుష్ప 2” ఆ స్థాయిని దాటి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

బుక్ మై షో టాప్ 5 ర్యాంకుల్లో ఈసారి టాలీవుడ్ సినిమాలు మూడు స్థానాలను ఆక్రమించడం టాలీవుడ్ స్థాయిని మరింత ఉజ్వలంగా చూపిస్తోంది. 2023లో విడుదలైన పుష్ప 2, టికెట్ అమ్మకాలతో పాటు కలెక్షన్ల పరంగానూ భారీ విజయాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరింత టికెట్ రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

హీరోగా సక్సెస్..లు రాకపోవడానికి కారణం అదే అంటున్న సత్యదేవ్.. కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus