ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా పుష్ప పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మొదట ఈ సినిమా పాన్ ఇండియా స్థాయని అందుకుంటుందా లేదా అని ఓ వర్గం ప్రేక్షకుల్లో సందేహం అయితే ఉండేది. ఇక ఫస్ట్ లుక్ టీజర్ వచ్చినప్పుడే అనుమానాలన్ని మాయమయ్యాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా మ్యూజిక్ అందించిన పోతున్నట్లు అర్థమవుతోంది.
దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుక్కుంది పీక.. అనే పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. RRR స్టైల్ లోనే పుష్ప ఫస్ట్ సాంగ్ ను కూడా ఐదు మంది స్టార్ సింగర్స్ తో ఐదు భాషలో ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నారు. పాట మేకింగ్ కోసమే 2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. పాటలో పుష్ప రాజ్ అల్లు అర్జున్ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడట. అల్లు అర్జున్ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇక ఇలాంటి హై వోల్టేజ్ పాటలో అతను ఏ రేంజ్ లో కనిపిస్తాడు అనేది ఊహకు కూడా అందడం లేదు. చూస్తుంటే మొదటి పాటతోనే సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది. ఇక సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక పార్ట్ 2ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారు.