Daakko Daakko Meka Song: ఆకట్టుకుంటున్న ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గతంలో బన్నీ- సుకుమార్-దేవి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రంలోని పాటలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే దేవి శ్రీ – బన్నీ, సుకుమార్- దేవి శ్రీ ప్రసాద్.. కాంబినేషన్లో రూపొందిన అన్ని సినిమాల్లోని పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

దాంతో ‘పుష్ప’ ఆల్బమ్ పై అందరి దృష్టి పడింది.ఈరోజున అనగా ఆగస్టు 13న 5 భాషల్లో ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.వారు ప్రకటించినట్టుగానే ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ 5 భాషల్లో కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి.. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ ‘దాక్కో దాక్కో మేక’ పాటని సింగర్ శివమ్ ఆలపించాడు. పాట మొదట కొంచెం స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపించినా..

తర్వాత మనకు తెలీకుండానే ఇన్వాల్వ్ అయ్యేలా ఉంది. ‘కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం’ అనే లిరిక్స్ మైండ్లో యిట్టె రిజిస్టర్ అయిపోతాయి. ‘గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా సెప్పడెహే’ అంటూ చాలా ఫిలాసఫీలు కూడా ఉన్నాయి. ఈ పాట చాలా మాస్ అలాగే ఇన్స్పిరేషనల్ గా కూడా ఉందని చెప్పాలి. ఇంకెందుకు లేటు మీరు కూడా ఓసారి వినెయ్యండి :


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus