Pushpa Leak: చర్యలు తప్పవంటున్న మైత్రి మూవీ మేకర్స్!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి లీకుల వ్యవహారం పెద్ద తలనొప్పిలా మారింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విడుదలకు ముందే పైరసీ యథేచ్ఛగా జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ ప్రచార చిత్రంతో పాటు ఆ తరువాత వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్ మీడియాలో ముందే దర్శనమిచ్చాయి. సినిమా కంటెంట్ ఇలా ముందే బయటకు రావడంపై మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల తమ సినిమా మెటీరియల్ ఆన్ లైన్ లో లీక్ కావడంపై తీవ్రంగా కలత చెందామని.. ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేశామని.. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కోరినట్లు రాసుకొచ్చారు.

దయచేసి ఎవరూ పైరసీను ప్రోత్సహించవద్దని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus