Pushpa: పుష్ప ది రూల్ లో అలాంటి పాట ఉండనుందా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 526 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ మొత్తంలో షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ 600 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు సాంగ్ అంచనాలను మించి హిట్టైంది. అయితే ఆర్ఆర్ఆర్ స్పూర్తితో బన్నీ పుష్ప2 సినిమాలో అలాంటి పాట ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ లో బన్నీకి తన డ్యాన్సింగ్ స్కిల్స్ ను పూర్తిస్థాయిలో చూపించే అవకాశం రాలేదు. పుష్ప ది రూల్ సినిమా ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది.

దర్శకుడు సుకుమార్ సైతం ఈ సినిమాలో డ్యాన్స్ కు మరింత ప్రాధాన్యత ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాలని సుకుమార్, బన్నీ అనుకుంటున్నారు. బన్నీ సుకుమార్ కెరీర్ లో పుష్ప2 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిందని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నాటు నాటు పాటలో తారక్, చరణ్ అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసి మెప్పించారు. పుష్ప2 సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus