Fahadh Faasil: ఫహద్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి నటుడు ఫహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈయన పాత్రకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈయన కేవలం మలయాళ సినిమాలో మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలోను నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఫహద్ ఫాసిల్ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రొద్దుటూరులో సందడి చేశారు. ఈయన నటిస్తున్నటువంటి తన కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రొద్దుటూరులో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈయన ఒక హోటల్లో భోజనం చేసే సన్నివేషాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా హోటల్లో భోజనం చేసి ఒక సాధారణ వ్యక్తిగా ఈయన అట్నుంచి ఆటోలో ప్రయాణం చేస్తూ ఎంతో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ఇందుకు సంబంధించినటువంటి వీడియోని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తూ ఉండటం విశేషం. ఇలా స్టార్ హీరో అయినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ఈయన తన సింప్లిసిటీని ప్రదర్శించడంతో అభిమానులు కాస్త ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

ఈయన పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సీక్వల్ సినిమాలో అల్లు అర్జున్ (Fahadh Faasil) ఫహద్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus