Pushpa2: పుష్ప2 ఇంటర్వెల్ సీన్ ను ఏకంగా అలా ప్లాన్ చేయడం జరిగిందా?

వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో పుష్ప2 సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. అద్బుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ సీన్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. పుష్పరాజ్ అమ్మవారి గెటప్ లో కనిపించిన ఒక పోస్టర్ కొన్నిరోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇంటర్వెల్ సన్నివేశంలో బన్నీ కనిపించే గెటప్ ఇదేనని బోగట్టా. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ఏకంగా 35 రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉండటం వల్లే ఈ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. బన్నీ లుక్ కూడా కొత్తగా ఉండనుందని ఈ సినిమాలో బన్నీ మేకప్ కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందని సమాచారం అందుతోంది. బన్నీ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రెండేళ్లకు ఒక సినిమా (Pushpa2) తెరకెక్కేలా బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. త్వరలో బన్నీ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. బన్నీ పాన్ వరల్డ్ స్థాయిలో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus