అల్లు అర్జున్, సుకుమార్..ల ‘పుష్ప 2’ 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2వ వారం బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా … 3వ వారం ఎందుకో డౌన్ అయినట్లు కనిపిస్తోంది. 3వ వీకెండ్ ని ఈ సినిమా పెద్దగా క్యాష్ చేసుకోలేదు. మరోపక్క అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. నార్త్ లో ‘పుష్ప 2’ భారీ లాభాలు రాబడుతుంది. కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు.
అయితే క్రిస్మస్ హాలిడే రూపంలో ఈ సినిమాకి ఓ గోల్డెన్ ఛాన్స్ ఉంది. మరి దాన్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఒకసారి ‘పుష్ప 2’ 20 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 82.60 cr |
సీడెడ్ | 32.28 cr |
ఉత్తరాంధ్ర | 21.35 cr |
ఈస్ట్ | 11.14 cr |
వెస్ట్ | 8.89 cr |
కృష్ణా | 10.76 cr |
గుంటూరు | 12.85 cr |
నెల్లూరు | 6.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 186.6 cr |
కర్ణాటక | 40.18 cr |
తమిళనాడు | 12.2 cr |
కేరళ | 9.98 cr |
ఓవర్సీస్ | 101.02 cr |
నార్త్ | 300.52 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 650.5 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 20 రోజుల్లో ఈ సినిమా రూ.650.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.45.5 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.