యూఎస్,ఆస్ట్రేలియా సహా అంతటా మంచి వసూళ్లు రాబడుతున్న ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా “పుష్పక విమానం” ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ వారం రిలీజైన చిత్రాల్లో యూఎస్, ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. యూఎస్ లో శనివారం వరకే 70 వేల అమెరికన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే లక్ష యూఎస్ డాలర్స్ మార్క్ కు రీచ్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర లక్ష డాలర్లకు చేరువకావడం ఫేర్ కలెక్షన్ అని ట్రేడ్ వర్గాలుంటున్నాయి.అలాగే ఆస్ట్రేలియా లో 16,512 డాలర్లు కలెక్ట్ చేసి ఈ వారం రిలీజైన తెలుగు సినిమాలలో టాప్ గా నిలిచింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ “పుష్పక విమానం” సినిమాను లాస్ట్ ఫ్రైడే విన్నర్ గా చెబుతున్నారు. గత శుక్రవారం రిలీజైన చిత్రాల్లో “పుష్పక విమానం” చిత్రం వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. సినిమా బాగుందనే టాక్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తున్నారు. మహిళల గురించి ఓ మంచి విషయాన్ని చెప్పిన సినిమా కాబట్టి సకుటుంబ ప్రేక్షకులకు “పుష్పక విమానం”పై పాజిటివ్ ఓపీనియన్ ఏర్పడింది. దాంతో మల్టీప్లెక్స్ థియేటర్స్ సహా సింగిల్ స్క్రీన్స్ లో ఆక్యుపెన్సీ పెరుగుతోందని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. ఈ వారంలో వస్తున్న వసూళ్లు, పెరుగుతున్న టాక్ అనలైజ్ చేస్తే ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాతో మరో డీసెంట్ హిట్ కొట్టాడనే అర్థమవుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus