Pv Sindhu: ఆ బయోపిక్ లో నటిస్తానన్న పీవీ సింధు.. కానీ?

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అలీతో సరదాగా షోకు హాజరు కాగా తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో పీవీ సింధు మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని ఆమె కామెంట్లు చేశారు. తనకు వచ్చే ప్రేమలేఖలను ఇంట్లో వాళ్లందరూ కలిసి చదువుతారని ఆమె అన్నారు.

70 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి తనకు లవ్ లెటర్ రాశాడని ఆ వ్యక్తి లెటర్ లో తనకిచ్చి పెళ్లి చేయని పక్షంలో కిడ్నాప్ చేస్తానని బెదిరించాడని పి.వి.సింధు అన్నారు. ఏదైనా పోటీలలో పాల్గొని గెలుపొందిన సమయంలో అక్కడ మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారని ఆ సమయంలో నాకెప్పుడూ కన్నీళ్లు వస్తుంటాయని పి.వి.సింధు అన్నారు. మన జాతీయ గీతం విదేశాల్లో వినిపించిన సమయంలో గర్వంగా అనిపిస్తుందని పి.వి.సింధు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీనటులను తాను అభిమానిస్తానని ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని పీవీ సింధు అన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఏమో.. నా బయోపిక్ లో నేనే నటిస్తానేమో ఎవరికి తెలుసు? పీవీ సింధు అన్నారు. నేను ఏదైనా పోటీలో ఫెయిల్ అయిన సమయంలో ఎందుకలా ఆడుతున్నావ్ అని కామెంట్లు చేస్తారని పీవీ సింధు చెప్పుకొచ్చారు.

అంతకుముందు గేమ్ లో ఆడిన విధంగా ఇప్పుడు కూడా ఆడొచ్చు కదా అని అంటారని పీవీ సింధు చెప్పుకొచ్చారు. వాళ్లు అలా కామెంట్లు చేసిన సమయంలో నువ్వు వచ్చి ఆడు.. నీకు కూడా తెలుస్తుంది అని చెప్పాలనిపిస్తుందని పీవీ సింధు అన్నారు. ప్రముఖ అకాడమీ నుంచి బయటకు వెళ్లడం గురించి పీవీ సింధు స్పందిస్తూ అక్కడ నాకు కొన్ని విషయాలు నచ్చలేదని పీవీ సింధు కామెంట్లు చేశారు. పీవీ సింధు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus