Pv Sindhu: చిరంజీవి పాటకు స్టెప్పులేసిన పీవీ సింధు.. వైరల్ అవుతున్న వీడియో.!

పీవీ సింధు.. తెలుగు ప్రజలకు, ప్రపంచ స్పోర్ట్స్ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ని తన ప్రొఫెషన్‌గా ఎంచుకుంది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ ఎన్నో పథకాలు సాధించింది. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది..

ఇలా పీవీ సింధు ఖాతాలో ఎన్నో రికార్డులున్నాయి. ఆమె ప్రతిభకు మెచ్చి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.. సింధు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది.. తన ప్రొఫెషన్, పర్సనల్ విషయాలతో పాటు లేటెస్ట్ ఫోటో షూట్స్, రీల్స్ షేర్ చేస్తుంటుంది.. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లోని ‘వేర్ ఈజ్ ద పార్టీ’ పాటకు స్టెప్పులేసింది సింధు.. బ్యూటిఫుల్ స్మైల్‌తో, కూల్ అండ్ సింపుల్‌గా డ్యాన్స్ చేసింది.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus