జెఎఫ్ డబ్ల్యూ కవర్ పేజ్ పై ఒలింపిక్స్ విజేత సింధు!

రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రస్తుతం ఆకాశంలో విహరిస్తున్నారు. మెడల్ సాధించిన తర్వాత ఈ తెలుగమ్మాయికి గౌరవం, అవకాశము పెరిగాయి. వివిధ రాష్ట్రాల వారు అందించే ప్రోత్సాహాలతో ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఫోటో గ్రాఫ్ లు, ఇంటర్వ్యూ లతో నిత్యం మీడియాలో ఉంటున్నారు.

ఇందులో భాగంగా జస్ట్ ఫేర్ వుమన్  (జెఎఫ్ డబ్ల్యూ) మ్యాగజైన్ వారు సింధు పై కవర్ స్టోరీ ప్రచురించింది. ఇందుకోసం సింధు మోడ్రన్ అవుట్ ఫిట్ ధరించి నవ్వుతూ ఫోటలకు ఫోజులిచ్చారు. కొత్తల్లో కెమెరాల ముందు నిలబడేందుకు సిగ్గుపడే పొడగరి.. ఎంతో ఆత్మవిశ్వాసంతో జెఎఫ్ డబ్ల్యూ ఇంటర్వ్యూ లో పాల్గొనడం విశేషం. సింధు తాజా ఫ్యాషన్ ఫొటోలు అందరికీ తెగ నచ్చేస్తున్నాయి. భాగ్యనగరి బ్యూటీ అంటూ నెటిజనులు స్టార్ క్రీడాకారిణికి కితాబు ఇస్తున్నారు.

https://www.youtube.com/watch?v=tIMMpT7KlHE

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus