నాగ్, మహేశ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన పీవీపీ!

స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలను తీసిన పీవీపీకి విజయలకంటే అపజయాలు ఎక్కువగా వచ్చాయి. వ్యాపార పరంగా అడుగెడిన ప్రతిదాన్లోను విజయం సాధించిన ఈయన సినిమాల్లో మాత్రం ఆ ఫలితాన్ని పొందలేకపోయారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా సమయంలో అయితే ఆయన నిర్మాణ రంగాన్ని వదిలి వెళ్ళిపోతున్నారన్న పుకార్లు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఈ రంగంలో మామూలే అని చెప్పుకొచ్చిన పీవీపీ కాన్సెప్ట్ సినిమాలతో పాటు కాంబినేషన్ సినిమాలు ముఖ్యం అని అంటున్నారు. ఈ సందర్బంగా నాగార్జున, మహేశ్ సినిమాలపైనా స్పష్టతనిచ్చారు.

నాగ్ తో చేసిన ‘ఊపిరి’ కాసులతో పాటు ప్రశంసలనీ కురిపించింది. దాంతో నాగ్ తో మరో సినిమా చేయాలనీ పీవీపీ తలంచారు. ‘రాజుగారి గది’ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఓంకార్ ఈ సినిమా సీక్వెల్ ను నాగ్ తో చేస్తున్నట్టు ఇటీవల సంగతి తెలిసిందే. ఓంకార్-నాగ్ సినిమా తెరకెక్కనున్నది పీవీపీ బ్యానర్ లోనే. నాగ్ నిద్రలేకుండా చేస్తుందన్న కథ ఇదేనా అని టాలీవుడ్ వర్గాలు ఆరాలు తీస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మహేశ్ హీరోగా పీవీపీ సంస్థ నిర్మించిన ‘బ్రహ్మోత్సవం’ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోర పరాజయంగా మిగిలింది. ఈ సినిమాతో పివిపి భారీ నష్ఠాలను చవి చూశారు. దాంతో నిర్మాతల హీరో అయిన మహేశ్ ఇదే బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాటిచ్చారు. దీని ఫలితమే ఆ మధ్య వెలువడిన వంశీ పైడిపల్లి సినిమా ప్రకటన. అయితే తర్వాత ఈ విషయమై చడీ చప్పుడు లేకపోవటంతో యధావిధిగా సినిమా అటకెక్కినట్టే అనుకున్నారు. దీనికి సమాధానంగా వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిపారు పీవీపీ. వంశీ దర్శకుడిగా ఒకే గానీ రైటర్ గా బాగా వీక్. మహేశ్ కూడా కొరటాల సినిమా చేయాల్సి ఉండటంతో ఈ సినిమా ముహూర్తం వచ్చే ఏడాదికి మారింది. అదీ అసలు సంగతి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus