ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సూపర్ ఫ్లాపులు. కోట్లకు పడగలెట్టిన పివిపి కాబట్టి తట్టుకోగలిగాడు కానీ.. అదే వేరే నిర్మాత ఎవరైనా అయ్యుంటే, సదరు సినిమాల ద్వారా నష్టపోయిన మొత్తాన్ని బేరీజు వేసుకొని ఈపాటికి దివాళా తీసి ఉండేవాడు.
కానీ. పివిపి మాత్రం ఆ పని చేయకుండా “ఇకపై సినిమాలు తీయకూడదు” అని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేసి.. మునుపటిలా సినిమాలకు ఫైనాన్స్ చేసుకొంటూ హ్యాపీగా ఉండాలని నిశ్చయించుకొన్నాడట.
ఆయన నిర్మాణ సారధ్యంలో రూపొందిన తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” డిజాస్టర్ గా నిలవడంతోపాటు.. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దాంతో.. ఇక చిత్రా నిర్మాణానికి పివిపి దూరంగా ఉండాలని తీర్మానించుకొన్నాడట. మరి ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియదు కానీ.. ఇది నిజంగా నిజమైతే మాత్రం చిత్ర పరిశ్రమ ఒక మంచి నిర్మాతను పోగొట్టుకొన్నట్లే!