పీవీఆర్ థియేటర్లకు వందల కోట్ల నష్టం!

  • November 5, 2020 / 01:28 PM IST

లాక్ డౌన్ దెబ్బకి ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. ముఖ్యంగా కరోనా కారణంగా థియేటర్ల పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. గత నెలలో థియేటర్లు పునః ప్రారంభానికి పర్మిషన్లు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా పది శాతం థియేటర్లు కూడా ఓపెన్ కాలేదు. తెరుచుకున్న థియేటర్లను కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపించారు. థియేటర్లు ఎప్పటికి సాధారణ స్థాయిలో నడుస్తాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఈ రంగం కోట్ల రూపాయలు నష్టపోయింది.

మరింత నష్టాన్ని చవిచూడాల్సి పరిస్థితి కలిగేలా ఉంది. దేశంలో అతిపెద్ద థియేట్రికల్ సంస్థ పీవీఆర్ ఈ ఏడాది మూడో క్వార్టర్ కు సంబంధించి తాజాగా విడుదల చేసిన లాభ నష్టాల లెక్కలు చూస్తే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పటిలానే ఈ ఏడాది తొలి క్వార్టర్ లో మంచి ఆదాయం అందుకున్న పీవీఆర్.. రెండో క్వార్టర్ లో దెబ్బతింది. ఇక మూడో క్వార్టర్ లో దారుణంగా పడిపోయింది. గత మూడు నెలలకు ఎలాంటి ఆదాయం లేకపోగా.. రూ.184 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

గతేడాది ఇదే క్వార్టర్ లో పీవీఆర్ సంస్థ రూ.48 కోట్లు లాభాలు అందుకుంది. గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి పీవీఆర్ నికర ఆదాయం విలువ రూ.973 కోట్లు ఉండగా.. ఈసారి ఆ ఆదాయం రూ.40 కోట్లకు పడిపోయింది. గత నెలలో థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ రెండు వారాల్లో వచ్చిన ఆదాయం థియేటర్ మెయింటైనెన్స్‌ కూడా రాలేదు. ఇలా ఈ ఏడాది పీవీఆర్ సంస్థ వందల కోట్లలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మిగిలిన మల్టీప్లెక్స్ ల పారిస్తోతి కూడా ఇలా ఉంటుందని అర్ధమవుతోంది!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus