Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss: ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ ఆన్సర్స్ వెతుక్కోవాల్సి వచ్చిందిగా..!

Bigg Boss: ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ ఆన్సర్స్ వెతుక్కోవాల్సి వచ్చిందిగా..!

  • May 14, 2022 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ ఆన్సర్స్ వెతుక్కోవాల్సి వచ్చిందిగా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో యాంకర్ అనసూయ సెలబ్రిటిగా వచ్చి సందడి చేసింది. అంతేకాదు, టాస్క్ లో గెలిచిన నలుగురిలో ఓట్ అప్పీల్ చేసుకోవాలని అనుకునే వాళ్లు అనసూయని ఇంప్రెస్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శివ, అరియానా, అఖిల్, ఇంకా నటరాజ్ మాస్టర్ లు అనసూయని ఎంటర్ టైన్ చేశారు. అయితే, అనసూయ బయట నుంచీ ఆడియన్స్ ప్రశ్నలు అడిగారని, వాటిని ఇప్పుడు నేను అడుగుతానని సడెన్ గా ట్విస్ట్ ఇచ్చింది.

హౌస్ మేట్స్ ఎంటర్ టైన్మెంట్ మూడ్ లో ఉన్నప్పుడు సడెన్ గా ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చేందుకు హౌస్ మేట్స్ కాసేపు ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, దిమ్మతిరిగే ప్రశ్నలు ఆడియన్స్ ఆడిగేసరికి హౌస్ మేట్స్ కి సౌండ్ లేకుండా పోయింది. ఇలా కూడా ఆలోచిస్తున్నారా అంటూ కాసేపు వాళ్లు ఆలోచనలో పడ్డారు.

ముందుగా అరియానాని ప్రశ్న అడిగింది అనసూయ. ఫ్యామిలీ ఎపిసోడ్స్ అయిన తర్వాత బిందుకి క్లోజ్ అయ్యావ్ అని, శివ భజన చేస్తున్నావ్ అని , ఎందుకు బిగ్ బాస్ లో లేడీ విన్నర్ అవ్వాలని చెప్పి ఉమెన్ కార్డ్ ని తీస్కుని వస్తున్నారు అంటూ అడిగింది ? దీనికి సమాధానంగా నాకు ఎప్పుట్నుంచో అమ్మాయి బిగ్ బాస్ గెలవాలని అనుకున్నామని సీజన్ 4లో నా ఫుటేజ్ కూడా ఉంటుంది చూడమని చెప్పింది.

బిందు ఫ్రశ్న : శివ మీకు క్లోజ్ ఫ్రెండ్ కదా, తను నోరుజారి అన్నా కూడా, బ్రతిమిలాడినా కూడా మీరు కనికరించలేదు. చాలాసేపు సారీ చెప్పాడు. స్వాప్ ని అంగీకరించమన్నాడు. కానీ మీరు ఒప్పుకోలేదు ఎందుకు బిందు జవాబు – నేను ఆ టైమ్ లో బాగా హర్ట్ అయ్యాను. అందుకే, శివ అన్న మాటలు చాలాసేపు నా మైండ్ లో ఉండిపోయాయి. నా ఫ్రెండే అలా అంటే ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను నార్మల్ అయ్యాను, తన స్వాప్ ని ఒప్పుకున్నాను. బిందు ఫ్రశ్న – నువ్వు గ్రూప్ గా గేమ్ ఆడతావ్. గ్రూప్ ని కంట్రోల్ చేస్తావ్.

కానీ, అఖిల్ ని బ్లేమ్ చేస్తావ్ ఎందుకు బిందు జవాబు – నేను ఏ గేమ్ గ్రూప్ గా ఆడలేదు. గ్రూప్ తో కలిసి ఉన్నాను కానీ, గ్రూప్ గా ఆడలేదు. దీనికి నేను ఎలా జవాబు చెప్పాలో కూడా అర్ధం కావట్లేదని చెప్పింది. ఇక్కడే అఖిల్ తను గ్రూప్ గేమ్ ఆడిందని, లైక్స్ టాస్క్ లో అనిల్ లైక్స్ ఇచ్చాడని అఖిల్ గుర్తు చేశాడు. ఇక్కడే బిందు కౌంటర్ వేసింది. అఖిల్ గేమ్ నుంచీ అవుట్ అయిన తర్వాత నాకు ఇచ్చాడని, అది గ్రూప్ గా గేమ్ ఆడటం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది.

నటరాజ్ మాస్టర్ – మీ పాపకోసం ఆడతానని అన్నారు. అది చాలా గర్వపడే విషయమే కానీ, నీ బిహేవియర్ హౌస్ లో చూసి ఆమె గర్వంగా ఫీల్ అవుతుందా ? తేజు, స్రవంతి, అరియానా, శివ, బిందు, హమీదాలతో మీ ప్రవర్తన బాగుందని అనుకుంటున్నారా ?

నటరాజ్ మాస్టర్ జవాబు – నిజంగా నామినేషన్స్ అఫ్పుడు గొడవలు అనేవి జరుగుతాయి. వాళ్లు తీసే పాయింట్స్ నాకు అస్సలు అర్ధంకాదు. అలాంటివి నాకు కోపం తెప్పించేవి మాట్లాడతారు. అందుకే, నేను అలా బిహేవ్ చేస్తాను తప్ప, విడిగా ఎప్పుడూ కూడా మాట్లాడను అని, కేవలం నామినేషన్స్ అప్పుడు మాత్రమే అలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మాస్టర్.

అఖిల్ ప్రశ్న – మిత్రాని నువ్వు బిందుపైకి, శివపైకి వెపన్ లా వాడుకున్నావా ?

అఖిల్ జవాబు – అసలు నేను అలాంటి అలోచనే లేదు. మిత్రాని ఇన్ఫులెన్స్ చేయడానికి చిన్నపిల్లేం కాదు. తను ప్రొడ్యూసర్, తనకి చాలా మెచ్యూరిటీ ఉంది. తను ఏం మాట్లాడాలో కూడా తనకి క్లారిటీ ఉంది. ఎపిసోడ్ చూస్తే క్లియర్ గా ఇది అర్దమవుతుంది. అంతేకాదు, నేను బిందుతో ఇలా మాట్లాడు, శివతో ఇలా ప్రవర్తించు అని నేను చెప్పలేదు. అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, మేము నామినేషన్స్ గురించి అస్సలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు అంటూ చెప్పాడు.

యాంకర్ శివ ప్రశ్న – నువ్వు ఈజీగా మాటలు అనేస్తావ్. కానీ, అది నీ ఉద్దేశ్యం కాదని చెప్తావ్. సరయు, బిందు, అషూలతో నోరుజారావ్ కదా. అది నీకు ట్రోఫీకి అడ్డమొస్తుందని అనుకుంటున్నావా ?

శివ జవాబు – నిజంగా అది నా ఉద్దేశ్యం కాదు. ఆ టైమ్ లో వేరే ఉద్దేశ్యంతో అంటాను. బయట నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ రాలేదు. కానీ, ఇక్కడ ఫీల్ అయ్యారని తెలుస్తోంది. వేరే విధంగా అర్దమవుతోందా అని తెలుస్తోంది. అందుకే, అది మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సడెన్ గా ఇది ఇష్యూ అవుతోంది. ఈ మాటలు ఆపుకోవచ్చు. ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పాడు.

అనిల్ ప్రశ్న – అసలు అనిల్ ఉన్నావా ? నువ్వు ఇక్కడి వరకూ కేవలం నీ గేమ్ వల్ల వచ్చావా ? గ్రూప్ గా కనెక్ట్ అయినందుకు ఇక్కడి వరకూ వచ్చావా ?

అనిల్ జవాబు – గ్రూప్ వల్ల కాదు, నా గేమ్ నేను ఆడటం వల్లే ఇక్కడి వరకూ వచ్చానని నమ్ముతాను అంటూ అనిల్ చెప్పాడు. ఆడియన్స్ మాత్రం హౌస్ మేట్స్ కి ఝలక్ ఇచ్చే ప్రశ్నలే అడిగారు. ఇప్పుడు ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ కొన్ని లెక్కలు ఖచ్చితంగా వేసుకుంటారు. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #anil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

9 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

10 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

8 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

9 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

10 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version