సింభూ రొమ్యాన్స్ “డోస్” పెంచాడా!!!

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సింభూ. అయితే తమిళ హీరోగానే కాకుండా తలుగులో కూడా సింభూ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. మరీ ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అంత సీన్ అయితే లేదు కానీ, విడుదలయిన సినిమా బావుంటే…ఖచ్చితంగా థియేటర్స్ కు వెళ్ళి చూస్ వరకూ సింభూకి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే గతంలో సింభూ తీసిన మన్మధ సినిమా ఎలాంటి విమర్శలకు దారి తీసిందో మనకు తెలిసిందే…

అంతేకాకుండా ఆ సినిమాపై అప్పట్లో మహిళా సంఘాలు రచ్చ…రచ్చ చేశాయి. ఇక ఆ తరువాత ఈ కుర్ర హీరో అలాంటి ప్రయోగాలు అయితే చెయ్యలేదు కానీ, తన సినిమాల్లో మాత్రం రొమ్యాన్స్ డోస్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. అదే క్రమంలో అందాల భామ నయనతార తో డేటింగ్ పుణ్యమా అని, వివాదాల్లో చిక్కుకుని, ఆ వివాదాల్లోనే బ్రతుకు సాగిస్తున్నాడు. అయితే ఈ కధ అంతా ఇప్పుడు ఎందుకంటే తాజాగా సింభూ చేస్తున్న సినిమా టైటిల్ ‘ఏ..ఏ..ఏ’ గా పెట్టారు. సాధారణంగా మంచి హాట్ హాట్ సినిమాలకి ఏ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది.

మరి అలాంటింది…ఏకంగా…మూడు ‘ఏ..ఏ..ఏ’ అంటే…అందులో ఇకెంత రసికత్వం దాచాడో సింభూ అని తమిళ తంబీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పబ్లిక్ అట్టెన్స్షన్ కోసం ఈ టైటిల్ పెట్టాడో…లేకపోతే సినిమాలో రొమ్యాన్స్ మొతాదు ఎక్కువ అవడం వల్ల ఈ టైటిల్ పెట్టారో తెలీదు కానీ మొత్తానికి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో మరోసారి వివాదాల్లో చిక్కుకోనున్నాడు అని మాత్రం స్పష్టం అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus