ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, నటుడు అయిన ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన అనారోగ్యం పాలైనట్లు, హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది. దీంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది అని చెప్పాలి. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రావడంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
రెండు రోజుల్లో ఆయన డిశ్చారి అవుతారట. ఆ వెంటనే అందరినీ కలుస్తానని.. తెలిపినట్టు సమాచారం. ఇక నారాయణ మూర్తి.. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి .ఆర్. నారాయణమూర్తి తల్లి రెడ్డి పేరు చిట్టెమ్మ. ఆమె 2022 లో మరణించారు. ఇక తండ్రి పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు. రౌతులపూడి లో 5వ తరగతి వరకు చదువుకున్నారు ఆర్.నారాయణ మూర్తి.
చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ (Sr NTR) , నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) సినిమాలు చూస్తూ పెరిగిన నారాయణ మూర్తి ….వారిని ఇమిటేట్ చేస్తూ నటనా జీవితాన్ని మొదలుపెట్టారు. నారాయణమూర్తికి సామాజిక స్పృహ ఎక్కువ. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవాత్మక సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. 1972 లో ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే అందులో ‘పాస్ అవ్వను’ అని గ్రహించి ఆయన మద్రాస్ కి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ‘ఒరేయ్ రిక్షా’ వంటి సినిమాల్లో నటించి పీపుల్స్ స్టార్ గా ఎదిగారు.