Raadhika Sarathkumar: ఆ హీరో సినిమాలన్నీ చూశానంటున్న రాధిక!

ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ పాత్రలతో పాటు ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ నాకు ప్రస్తుతం వస్తున్న పాత్రల విషయంలో తాను సంతృప్తితో ఉన్నానని ఆమె తెలిపారు. జీన్స్ సినిమాలో తాను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని అమె వెల్లడించారు. తెలుగులో చాలామంది హీరోలను తాను ఇష్టపడతానని రాధిక అన్నారు. తారక్ అంటే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ లో ఉండే ఎనర్జీ జూనియర్ ఎన్టీఆర్ లో కూడా ఉంటుందని తాను, శరత్ తారక్ అన్ని సినిమాలు సినిమాలు చూస్తామంటూ రాధిక షాకింగ్ కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ అంటే కూడా చాలా ఇష్టమని అల్లు అర్జున్ ను తాను చిన్నప్పటి నుండి చూశానని రాధిక పేర్కొన్నారు. అల్లు అర్జున్ ను చూసి తాను గర్వంగా ఫీల్ అవుతానని ఆమె చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ కూడా నా కళ్లముందు పెరిగాడని ఆమె వెల్లడించారు.

కృష్ణగారి షూటింగ్ లో మహేష్ బాబును చూశానని ఆ సమయంలో మహేష్ బాబు చాక్లెట్ బాయ్ లా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని రాధిక వెల్లడించారు. తమిళంలో అలాంటి పరిస్థితి లేదని ఆమె అన్నారు. అజిత్, విజయ్ మాత్రమే తమిళంలో టాప్ లో ఉన్నారని రాధిక వెల్లడించారు. బన్నీకి మలయాళంలో కూడా ఫాలోయింగ్ ఉందని ఆమె అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తో వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా చేశానని ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి క్రమశిక్షణ అంటే ఏంటో నేర్చుకున్నానని రాధిక వెల్లడించారు.

దర్శకుడు చెప్పిన మాటకు సీనియర్ ఎన్టీఆర్ ఎంతో విలువ ఇచ్చారని రాధిక పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నానని నా ప్రయాణం విషయంలో నేను సంతృప్తితో ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus