పాము పాత్ర పోషించనున్న రాయ్ లక్ష్మి

తెలుగు ప్రేక్షకులకు పాము సినిమా అనగానే దేవీ సినిమా గుర్తుకు వస్తుంది. ఇందులో నాగుపాముగా ప్రేమ నటించి మహిళలను మెప్పించింది. నాగదేవతగా ఆమెను అభిమానించారు. అటువంటి పాత్రను పోషించడానికి అందాల తార రాయ్ లక్ష్మి సిద్ధమవుతోంది. ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరుతో కలిసి రత్తాలు రత్తాలు పాటలో స్టెప్పులు వేసింది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో “జూలీ 2” సినిమా చేసింది. అందులో అందాలు ఆరబోసినప్పటికీ సినిమా ఫెయిల్ అయింది. దీంతో దక్షిణాది సినిమాలను నమ్ముకుంటే మేలని ఇక్కడి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె “నీయా2” లో నటిస్తోంది. 1979లో వచ్చిన కమల్‌హాసన్‌, శ్రీప్రియల ‘నీయా’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో రాయ్‌లక్ష్మి హీరోయిన్‌గా అలరించనుంది.

కథ ప్రకారం ఆమె మూడు పాత్రల్లో కనిపిస్తుంది. వాటిలో ఒకటి పాము పాత్ర కావడం విశేషం. ‘నీయా’లో శ్రీప్రియ పోషించిన పాము పాత్రనే సీక్వెల్‌లోను రాయ్‌లక్ష్మి పోషిస్తోంది. ఈ సినిమా గురించి ఆమె మీడియాతో మాట్లాడింది. “ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. నేను మూడు పాత్రలు పోషిస్తున్నాను. అందులో ఒకటి నాగపాము పాత్ర. నా కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక మలయాళంలో మమ్ముట్టి సార్‌ సినిమాలో నటించబోతున్నాను” అని వెల్లడించింది. ఇప్పటి వరకు అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తొలిసారి నటన ప్రాధాన్యత రోల్ చేయనుంది. మరి ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus