గోపీచంద్ కి షాకిచ్చిన రాయ్ లక్ష్మీ, హంసా నందిని..!

గత కొంత కాలంగా హిట్టుకొట్టడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు గోపీచంద్. ‘సౌఖ్యం’ ‘గౌతమ్ నంద’ ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలు డిజాస్టర్లు కాగా.. ఎన్నో అసలు పెట్టుకుని చేసిన తన 25 వ చిత్రం ‘పంతం’ కూడా నిరాశనే మిగిల్చింది. అప్పట్లో గోపీచంద్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు యువ హీరోల పోటీకీ గోపీచంద్ తడబడుతున్నట్టే కనిపిస్తుంది. అందులోనూ .. ఊరికే యాక్షన్ ఉంటే.. థియేటర్స్ కి రావడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఈ క్రమంలో గోపీచంద్.. తిరు అనే తమిళ డైరెక్టర్ తో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ ను ఇండియా – పాకిస్తాన్ బోర్డర్ లో చిత్రీకరించారు. ‘ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్’ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న… ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కోసం లక్ష్మీ రాయ్ మరియు హంసా నందినిని సంప్రదించగా…. వీరిద్దరూ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాత షాక్ అయ్యాడని తెలుస్తుంది. విషయాన్నీ పరిశీలిస్తే.. గోపీచంద్ కు ఈ మద్య కాలంలో హిట్టు లేకపోవడం వలెనే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం కోసం లక్ష్మీ రాయ్ దాదాపుగా 50 లక్షలు అలాగే.. హంసా నందిని 40 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జరీన్ ఖాన్ ను రంగంలోకి దించారని సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా.. గోపీచంద్ హిట్టు ఫామ్లోకి వస్తాడని ఆశిద్దాం.. !

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus