Raashi Khanna: రొమాంటిక్ సన్నివేశాల గురించి రాశీ ఖన్నా కామెంట్స్ వైరల్..!

  • June 30, 2022 / 12:20 PM IST

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’. జులై 1న(రేపు) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సీటీమార్’ తో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ నటిస్తున్న తర్వాతి చిత్రం కావడం..సక్సెస్ ఫుల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ అయిన ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ కావడం… ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రాశీ ఖన్నా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

‘మీకు ఎలాంటి సినిమాల్లో నటించడం ఇష్టం?’ అనే ప్రశ్నకి రాశీ ఖన్నా బదులిస్తూ… ‘నాకు రొమాంటిక్ సీన్స్ లో నటించడం అంటే ఇష్టం. కామెడీ సీన్స్ కంటే కూడా.. రొమాంటిక్ సీన్స్ లో నటించడం సులభం. ఇప్పటివరకు నేను రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేశాను. ప్రస్తుతం కామెడీ జోనర్‌ టచ్ చేశాను. దీనిని కూడా ఎంజాయ్ చేస్తున్నా..’ అంటూ రాశీ కన్నా చెప్పుకొచ్చింది. నిజమే గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లకి నటనతో పెద్దగా పని ఉండదు.

పాటలు ముందు వచ్చి.. పాటలో కనిపించే సైడ్ అయిపోతే సరిపోతుంది. కానీ ఇలా కామెడీ, సెంటిమెంట్ అంటే అది కష్టమైన పనే కదా మరి. పైగా గ్లామర్ రోల్స్ చేస్తే హీరోయిన్లు ఎక్కువ కాల్ షీట్లు ఇవ్వనవసరం లేదు. పైగా ఎక్కువ సినిమాలు ఒప్పుకోవచ్చు.. అవి చేసుకోవచ్చు. రాశీ ఖన్నా ఉద్దేశం కూడా అదే కావచ్చు.

ఇక ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో అద్భుతంగా కామెడీ చేసిన రాశీ ఖన్నా ఈ మూవీలో మరింత కామెడీ పండించింది అని వినికిడి. సీరియల్ ఆర్టిస్ట్ గా… కామెడీ లాయర్ గా ఈమె పాత్ర ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటుంది అని తెలుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus