ఆ ఒక్కటి తీరిపోతే రాశీ హ్యాపీ..!

మంచి హైట్.. మంచి గ్లామర్.. నటనలో కూడా ఆమె సూపరే కానీ విజయాలు, అవకాశాలు మాత్రం ఆమెను ఎక్కువ వరించవు ఆమెనే రాశీ ఖన్నా. ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరే స్టార్ హీరోతోనే ఈమె పనిచేయలేదు. మీడియం హీరోలతోనే సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ల స్థాయిలోనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాశీ ఖన్నా.. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ వెంటనే ఫ్యామిలీ హీరోయిన్ అవ్వాలని చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలించి. ఈ చిత్రం రాశీ ఖన్నా కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు.

అలా అని రాశీ తగ్గడం లేదు. ‘సాయి తేజ్ తో ‘ప్రతీరోజూ పండగే’ అంటూ ఇప్పుడు మరో ఫ్యామిలీ సినిమా చేస్తుంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు ‘వెంకీమామ’ అనే మరో ఫ్యామిలీ సినిమా చేస్తుంది. ఈ రెండు చిత్రాలూ హిట్టయితే ఈ అమ్మడు ఫ్యామిలీ హీరోయిన్ అయిపోయినట్టే. మరి ఈ అమ్మడి కోరిక తీరుతుందో లేదో చూడాలి..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus