కోలీవుడ్ లోనూ రాశి జోరు…

హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’ ద్వారా వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు చిత్రసీమకు చేరుకుంది. అదిమొదలు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఏడాదికి సగటున 3 సినిమాలు చేస్తున్న రాశికి సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. దాంతో దర్శక నిర్మాతలంతా రాశి వైపే ఆకర్షితులవుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాట ఇదే స్థాయిలో జోరు చూపుతోంది రాశి ఖన్నా.

ఇటీవల సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో అవకాశం అందుకున్న ఈ బొద్దుగుమ్మ ఆ వార్త చివరి పేజీకి చేరుకోకముందే మరో తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈమారు వరుస విజయాలతో కోలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్న అథర్వతో ఆడిపాడనుంది రాశి ఖన్నా. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో అవకాశం రావటం చిన్న విషయమేమీ కాదు. ఇదే కొనసాగితే తెలుగులో అవకాశాల వరద కారణంగా హైదరాబాద్ కి మకాం మార్చిన ఈ ఢిల్లీ భామ చెన్నై లోను మరో ఇల్లు చూసుకోక తప్పదు. సమంత సినిమాల నుండి తప్పుకున్న వేళా విశేషం ఈ అమ్మడికి బాగా కలిసొచ్చినట్టుంది కదూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus