ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన రాశీఖన్నా యువకుల ఊహల సుందరిగా మారిపోయింది. మొదట్లో బొద్దుగా కనిపించిన ఈ భామ రానురాను స్లిమ్ బ్యూటీగా తయారైంది. ఆమె శరీరాకృతిలో భారీ మార్పు వచ్చేందుకు సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ కృషి ఎంతో ఉంది. అతని ఆధ్వర్యంలోనే రాశీ కొంతకాలంగా వర్కౌట్స్ చేస్తోంది. ప్రస్తుత బాడీ సాధించడానికి రాశీ కష్టపడిన విధానం గురించి కులదీప్ ఇలా చెప్పుకొచ్చారు. ” ప్రస్తుతం రాశి ఖన్నా రోజులో ఒక గంట వర్కవుట్స్‌కి కేటాయిస్తుంది. ఎన్ని పనులున్నా వర్కవుట్స్ ఆపదు. కొన్ని సార్లు ఉదయం పూట కుదరకపోయినా మధ్యాహ్నం సమయంలో చేస్తుంది.” అని ఆమె సిన్సియారిటీ గురించి వివరించారు.
ఇంకా ట్రైనర్ మాట్లాడుతూ “రాశిఖన్నాశరీరతత్వం చాలా విభిన్నం. తనకి మజిల్ మాస్ ఎక్కువ. కాబట్టి తన శరీరాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేయిస్తే అది మరింత మజిల్‌మాస్‌కి కారణమవుతుంది.. అందుకని ఒక వారం ఫంక్షనల్ ట్రైనింగ్, ఒక వారం హై ఇంటెన్సిటీ వర్కవుట్, ఒక వారం వెయిట్ ట్రైనింగ్ ఇలా విభజించి చేయిస్తాను. అందుకు ఆమె బాడీ చాలా సహకరించింది. పైగా రాశీ న్యూట్రిషన్ షెడ్యూల్‌ని బాగా ఫాలో అవుతుంది. ఆమె డైట్ రొటీన్‌లో భాగంగా రోజుకు నాలుగు నుంచి 5 సార్లు ఆహారం తీసుకుంటుంది.” అని ముద్దుగుమ్మ గ్లామర్ రహస్యాన్ని కులదీప్ వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.