ఆకట్టుకుంటోన్న “రాధ” టీజర్

శతమానం భవతి చిత్రంతో విజయం అందుకున్న యువ హీరో శర్వానంద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో చేస్తోన్న “రాధ” టీజర్ నేడు (బుధవారం) రిలీజ్ అయింది. శివరాత్రి సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్‌ మాదిరిగానే ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ తెరకెక్కించిన ఈ మూవీ టీజర్ దశలోనే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్, అతని సరసన అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 29 న రిలీజ్ చేయడానికి నిర్మాత భోగవల్లి బాపినీడు సన్నాహాలు చేస్తున్నారు. మరో సారి శర్వానంద్ హిట్ కొట్టేశాడు .. అనిపించేంతగా ఉన్న రాధా టీజర్ ని మీరు ఓ లుక్ వేయండి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus