వేలాదిమంది ఆర్టిస్టులతో ఎన్టీఆర్ రథయాత్ర..!

‘ఎన్.బి.కె ఫిలిమ్స్’ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రానికి ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని చాలా అభూతంగా క్రిష్ తెరకెక్కించినప్పటికీ.. కల్పితం ఎక్కువయిందని… ‘మహానటి’ చిత్రంలో మాదిరిగా ఎమోషనల్ సీన్స్ లేవనే కామెంట్స్ మూటకట్టుకుంది.

ఈ చిత్రంతో డైరెక్టర్ క్రిష్ తన కెరీర్లోనే భారీ డిజాస్టర్ చవి చూసాడు. బాలకృష్ణతో గతంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వంటి సూపర్ హిట్ చిత్రంతో మంచి కలెక్షన్లను రాబట్టిన క్రిష్.. ఈ చిత్రంతో చాలా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ గా చలామణీ అవ్వాలని క్రిష్ ఎప్పుడూ ఆరాటపడలేదు. కమర్షియల్ గా భారీ హిట్ లేకపోయినా.. క్రిష్ సినిమా అంటే ప్రత్యేక గౌరవం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్.. మాస్ అనే తేడా లేకుండా ఎటువంటి ప్రేక్షకుడితోనైనా చప్పట్లు కొట్టించుకోకలిగే డైరెక్టర్ క్రిష్ అనడంలో సందేహం లేదు. అలాంటి క్రిష్ ఎదుర్కొన్న ఈ విమర్శలని… కరెక్ట్ చేసుకోవడానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పైన దృష్టి పెట్టాడట.

మొదటి పార్టులో జరిగిన తప్పులు.. రెండవ పార్టులో జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తేలుస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కాబోతోన్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎన్టీఆర్ చైతన్యరథంపై పర్యటించి, ప్రచారం చేస్తున్న దృశ్యాలను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరిస్తున్నాడు క్రిష్. ఇక ఈ షూటింగ్ లో ప్రస్తుతం బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు పాల్గొంటుండగా… మరికొన్ని సీన్లలో చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్న రానా కూడా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రీకరణ జనవరి 22న తేదీతో ముగుస్తుందని, షూటింగ్ కు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ చిత్రమైనా విజయం సాదిస్తుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus