Radhe Shyam Movie: ప్రభాస్ మూవీలో అసలు ట్విస్ట్ ఇదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన శైలికి భిన్నంగా రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే క్లాస్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి గతంలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ క్లైమాక్స్ లో పూజా హెగ్డే పోషిస్తున్న ప్రేరణ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.

నవ్యత ఉన్న కథలకు ప్రేక్షకాదరణ ఉన్న నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ క్లైమాక్స్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1920 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా క్లైమాక్స్ లో పూజా హెగ్డే పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ అయ్యే విధంగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. రాధేశ్యామ్ క్లైమాక్స్ ప్రేక్షకులకు సైతం కన్నీళ్లు పెట్టించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాధేశ్యామ్ అనే టైటిల్ పెట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రభాస్ కు స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి నటిస్తుండగా ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 30వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఆ డేట్ కు రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus