Radhe Shyam, RRR Movie: అలా అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కి దెబ్బ పడే అవకాశాలు ఎక్కువే..!

  • October 26, 2021 / 09:03 AM IST

‘సాహో’ దెబ్బకి ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పై జనాలు ఆ స్థాయిలో అయితే ఆశలు పెట్టుకోలేదు. ప్రభాస్ కోసం కచ్చితంగా ఓసారి అయితే చూడాలి అన్నట్టు అనుకున్నారు. పైగా దర్శకుడు రాధా కృష్ణకుమార్ మొదటి సినిమా అంత హిట్టు కాదు అలాగే నిర్మాతలు కూడా మొన్నటివరకు ప్రమోషన్లు చేసింది లేదు. అందుకే ‘రాధే శ్యామ్’ ను 2022 జనవరి 14కి విడుదల చేస్తాము అని ప్రకటించినా.. పవన్ ‘భీమ్లా నాయక్’, మహేష్ ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలు అదే టైంకి రావడానికి రెడీ అయ్యాయి.

కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ రకను కన్ఫర్మ్ చేయడంతో అవి చాలా వరకు తప్పుకోవడానికి రెడీ అయ్యాయి. కానీ ‘రాధే శ్యామ్’ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎలాగు ‘ఆర్.ఆర్.ఆర్’ ను జనవరి 7 కి విడుదల చేస్తాము అని ప్రకటించారు కాబట్టి.. ‘రాధే శ్యామ్’ కు 7 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం భావించింది. కానీ మొన్న ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ‘రాధే శ్యామ్’ టీజర్… సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది.

దాంతో ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఆలోచనలో పడింది. తెలుగులో ఎలా ఉన్నా బాలీవుడ్లో ‘రాధే శ్యామ్’ సత్తా చాటే అవకాశం లేకపోలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ కు కనీసం అక్కడ రెండు, మూడు వారాల గ్యాప్ కావాలి. ఎక్కువ థియేటర్లను కనుక ‘రాధే శ్యామ్’ పట్టుకుపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ కి చాలా కష్టం అయిపోతుంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుద్దో..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus