రాధికా క్రేజ్ పెరిగిపోయింది!

రాధికా ఆప్టే తొలుత తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోవడంతో రాధికాకు తమిళంలో అవకాశాలు రావడం మానేశాయి. దాంతో బాలీవుడ్ వెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ భామకు రజినీకాంత్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. ‘కబాలి’ సినిమాలో రజిని భార్యగా నటించిన రాధికా ఆప్టేకు ఆ సినిమా సక్సెస్ ను ఇచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. దీంతో రాధికాకు తమిళంలో క్రేజ్ పెరిగిపోయింది.

ఇప్పుడు వరుస అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదే కోవలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ తన సొంత నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ధనుష్ సరసన రాధికా ఆప్టే బావుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా గనుక హిట్ అయితే రాధికా ఇక తమిళంలో బిజీ అయిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus