అందుకే ఆ బ్లాక్ బస్టర్ సినిమా కోల్పోయాను : రాధిక ఆప్టే

బాలీవుడ్లో వివాదాలకు ‘కేర్ ఆఫ్ అడ్రెస్స్’ అంటే టక్కున చెప్పే పేరు రాధిక ఆప్టే. తనదైన శైలిలో బోల్డ్ కామెంట్స్ చేస్తూ నిత్యం ఇదొక వార్తలో నిలుస్తూ ఉంటుంది ఈ భామ. వరుస సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ హాట్ బ్యూటీ. ‘రక్త చరిత్ర’ ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ వంటి చిత్రాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇదిలా ఉండగా ఈ భామ బీర్లు తాగినందుకు ఓ బ్లాక్ బస్టర్ చిత్రంలో అవకాశం కోల్పోయిందట. ఈ విషయాన్ని నేహా దుపియా టాక్ షోలో రాధిక ఆప్టేనే చెప్పుకొచ్చింది.

ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన ‘విక్కీ డోనర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. యామి గౌతమ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా రాధిక ఆప్టే ని ఎంపిక చేశారట. రాధిక ఆప్టే మాట్లాడుతూ.. ” ‘విక్కీ డోనర్’ చిత్రంలో హీరోయిన్ గా నన్ను ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ కు సమయం ఉండడంతో విహారయాత్రకు వెళ్ళాను. అక్కడ బాగా తిని, బీర్లు ఎక్కువగా తాగడం వలన బరువు పెరిగిపోయాను. షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి నేను చాలా లావుగా ఉన్నాను. కాస్త సమయం ఇస్తే సన్నబడతానని నిర్మాతల్ని రిక్వస్ట్ చేశాను. కానీ షూటింగ్ లేటవుతుందనే ఉద్దేశంతో నా స్థానంలో యామి గౌతమ్ ను తీసుకున్నారు. అలా ఓ మంచి సినిమా మిస్ చేసుకున్నాను. అయినా నాకు అంత భాద లేదు. ఎందుకంటే అంతకు మించిన సినిమాలు వస్తాయి. కానీ బీర్లు తాగి లావయ్యాననే నెపంతో సినిమా నుండీ తొలగించడం వాళ్ళ మీద చిర్రెత్తుకొచ్చింది. అప్పటి నుండీ తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus