టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టి ప్రపంచ రెకార్డ్ సృష్టించిన శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఇతని జీవితం చాలా ఎమోషనల్ జర్నీ అన్న సంగతి చాలా మందికి తెలీదు. ముత్తయ్య మురళీ ధరన్ గురించి మనకు తెలియని విషయాలను వెండితెర పై ఆవిష్కరించాలని తమిళ దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి డిసైడ్ అయ్యాడు. అందుకు విజయ్ సేతుపతిని హీరోగా ఎంచుకున్నాడు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. అయితే మురళీ ధరన్ గెటప్లో విజయ్ సేతుపతిని చూసిన కోలీవుడ్ ప్రేక్షకులు.. తట్టుకోలేక విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు.
సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా కూడా ‘విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవాలంటూ’ సలహాలు ఇవ్వడం మనం చూస్తూ వచ్చం. అయితే తాజాగా ఈ కామెంట్స్ ను ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక ఖండించారు. అంతేకాదు విజయ్ సేతుపతిని వెనకేసుకొచ్చారు కూడా..! ఆమె మాట్లాడుతూ.. “విజయ్ సేతుపతిని… ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించకూడదంటున్నారు.మీకేమి పనిలేదా..? హైదరాబాద్… సన్‌రైజర్స్ టీం కు మురళీధరన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ టీం కూడా ఓ తమిళ రాజకీయ నాయకుడిదే కదా…!
మీరు వాళ్ళను ఎందుకు ప్రశ్నించరు.? విజయ్ సేతుపతి ఒక నటుడు. నటుడిని, క్రికెటర్‌ని కలపకండి. సన్‌రైజర్స్, సన్‌టీవీ ఓనర్లు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు రాజకీయాలను, స్పోర్ట్స్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చెయ్యడం లేదా.? రాజకీయాలకు అతీతంగా సినిమా పరిశ్రమను ఎందుకు చూడలేకపోతున్నారు. ఏదో గొడవ పడాలని నేను ఈ ట్వీట్ వెయ్యడం లేదు. సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా మాత్రమే ఈ ట్వీట్ వేస్తున్నాను. అందుకే సన్‌రైజర్స్ పేరును వాడాల్సి వచ్చింది” అంటూ రాధిక తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!