Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పైన ఎస్ జె సూర్య – లారెన్స్ మాస్టర్.. అసలు ట్విస్ట్ ఇదే..!

బిగ్ బాస్ సండే ఎపిసోడ్ అంటేనే ఫన్ డే ఎపిసోడ్. అయితే, అది ఇప్పుడు ఎలిమినేషన్ డే గా మారిపోయింది. టేస్టీ తేజ అనూహ్యంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తేజ ఎలిమినేట్ అయిపోయాడనే వార్తలే వినిపించాయి. సండే ఎపిసోడ్ లో ఎస్ జె సూర్య, లారెన్స్ మాస్టర్ ఇద్దరూ కూడా సందడి చేశారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన జిగర్ మార్తాండ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లారెన్స్ మాస్టర్ ఇంకా ఎస్ జె సూర్య ఇద్దరూ కూడా స్టేజ్ పైకి వచ్చి నాగార్జునని అలాగే హౌస్ మేట్స్ ని పలకరించారు.

ఇక్కడే లారెన్స్ సిగ్నేచర్ స్టెప్స్ ని ట్యూన్స్ గా వినిపించి హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించాడు కింగ్ నాగార్జున. దీంతో లారెన్స్ సూపర్ మార్క్ అయిన ఇంద్ర వీణ స్టెప్పుని పల్లవి ప్రశాంత్ హౌస్ లో వేసి చూపించాడు. అలాగే, లారెన్స్ మాస్టర్ స్టేజ్ పైన ఈ స్టెప్ ని వేసి అందర్నీ ఎంటర్ టైన్ చేశారు. ఇక హౌస్ లో సూపర్ డ్యాన్సర్ ఉన్నాడని చెప్పి టేస్టీ తేజని పరిచయం చేశాడు కింగ్ నాగార్జున. తేజ తను గాలికొట్టే స్టెప్పుని వేసి అందరినీ నవ్వించాడు.

అలాగే లారెన్స్ మాస్టర్ అయితే ఈ స్టెప్ ని నాకు ఇచ్చేయమని నేను నా తర్వాత సినిమాలో ఇది పెట్టుకుంటానని చెప్పాడు. దీంతో తేజ దండం పెట్టేశాడు. టేస్టీ తేజ వేసిన డ్యాన్స్ కి మాస్టర్, అలాగే సూర్య ఇద్దరూ కూడా ఫిదా అయిపోయారు. ఇద్దరూ చాలాసేపు హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించి ఫన్ చేశారు. అలాగే, సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ఈషారెబ్బ కూడా వచ్చినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఎలిమినేషన్ ఘట్టం అనేది చాలా రసవత్తరంగా జరిగింది.

ఎలిమినేషన్ లో (Bigg Boss 7 Telugu) లాస్ట్ వరకూ కూడా తేజ ఇంకా రతిక ఉన్నారు. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఇక్కడే టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగానే శోబాశెట్టి బోరున ఏడ్చేసింది. శోభాకి – తేజకి ఈవారం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారిద్దరూ ఒకరోజు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. గత కొన్ని వారాలుగా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఇంట్లో ఉంటున్నారు. మంచి కంటెంట్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు తేజ ఎలిమినేషన్ అవ్వడం వల్ల శోభా ఎమోషనల్ అయ్యింది. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus