Raghava Lawrence: కాంచన4 సినిమాలో సీతారామం బ్యూటీ.. అసలు వాస్తవాలివే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సీతారామం (Sita Ramam) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఫ్యామిలీ స్టార్ మూవీ ఆమె హ్యాట్రిక్ కు బ్రేకులు వేసింది. అయితే కాంచన4 సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు మరీ ఎక్కువ కావడం రాఘవ లారెన్స్ (Raghava Lawrence) స్పందించి క్లారిటీ ఇచ్చారు. మృణాల్ ఠాకూర్ పేరు ప్రస్తావించకుండానే రాఘవ లారెన్స్ ఈ క్లారిటీ ఇచ్చారు.

కాంచన4 నటుల ఎంపిక గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి రూమర్లు మాత్రమేనని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. కాంచన4 సినిమాలో నటించే యాక్టర్లకు సంబంధించి రాఘవ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని రాఘవ లారెన్స్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ లో మృణాల్ ఠాకూర్ భాగమై ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

కాంచన సిరీస్ సినిమాలు హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కాంచన4 సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. కాంచన4 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. కాంచన4 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాంచన4 సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. రాఘవ లారెన్స్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus