రాఘవ లారెన్స్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ గ్రూప్ డాన్సర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తక్కువ టైంలోనే కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆయనకు బాగా సాయం చేసినట్లు చాలా సార్లు చెప్పుకొచ్చారు.ఆ విభాగంలో స్టార్ స్టేటస్ దక్కించుకున్నాక.. నాగార్జున సాయంతో దర్శకుడిగా మారాడు. ‘మాస్’ సినిమాతో దర్శకుడిగా కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు లారెన్స్. ఆ తర్వాత ‘స్టైల్’ ‘ముని’ ‘కాంచన’ ‘గంగ’ వంటి సినిమాలు కూడా తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.
మధ్యలో సంగీత దర్శకుడిగా కూడా ఓ ట్రయిల్ వేశారు లారెన్స్. అయితే లారెన్స్ కి ఓ ఓ మైనస్ ఉంది. అదేంటి అంటే.. లారెన్స్ సొంత దర్శకత్వంలో సినిమాలు చేసుకుంటే.. హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. కానీ లారెన్స్ వేరే దర్శకులతో పని చేసినప్పుడు మాత్రం చాలా వరకు ప్లాప్స్ పడ్డాయి. దీనికి కారణం ఏంటి అని.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్స్ లో లారెన్స్ ని ప్రశ్నించగా.. ‘ నా డైరెక్షన్లో నేను చేసినప్పుడు ..
అభిమానులకి, ప్రేక్షకులకి ఏం కావాలో నేను అవి మిస్ కాకుండా చూసుకుంటాను. కానీ వేరే వాళ్ళ దర్శకత్వంలో చేసినప్పుడు.. నాకు చెప్పేది ఒకటి ఉంటుంది.. వాళ్ళు చేసేది ఇంకొకటి ఉంటుంది. ఆ టైంలో నేను వాళ్ళ డైరెక్షన్లో కూడా వేలు పెట్టను’ అంటూ లారెన్స్ (Raghava Lawrence) చెప్పుకొచ్చాడు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!